భీమవరం నియోజకవర్గ జనసేన పార్టీలో భారీ చేరికలు

భీమవరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి భీమవరం నియోజకవర్గం, భీమవరం మండలం, కొత్త పూసలమర్రు గ్రామంలో మాజీ ఎంపీటీసీ కొల్లాటి వర్మ, వైస్ ప్రెసిడెంట్ బర్రె నాగరాజు, కొల్లాటి నరసింహారావు, తిరుమాని రాజ్ కుమార్ లు వారి అనుచరులతో దాదాపుగా 200 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ మరియు రాష్ట్ర జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు బొమ్మిడి నాయకర్ మరియు జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు(చినబాబు), పీఏసీ సభ్యులు కనకరాజు సూరి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమళ్ళ చంద్రశేఖర్, భీమవరం మండలం అధ్యక్షులు మోక శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భీమవరం మరియు నరసాపురం నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.