చాగల్లులో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

సత్తెనపల్లి: నకరికల్లు మండలం, చాగల్లు గ్రామంలో జనసేన పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నకరికల్లు జనసేన పార్టీ కమిటీ ఏర్పాటు చేసిన క్రిస్ మస్ కేక్ ను కట్ చేసిన బొర్రా.. ఈ సందర్బంగా బొర్రా మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా ప్రపంచమంతుట ఘనంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అని అన్నారు. సర్వ మానవాళి ఏసుక్రీస్తు చూపిన బాటలో మనమంతా నడవాలి. మనకున్న దానిలో ఇతరులకు సాయం చేయాలని, ఆ సాయం వల్ల ఆ ప్రభువు మనల్ని చల్లగా చూస్తాడన్నారు. నేను పేద ప్రజలకు నాకున్న దానిలో ఎంతో సహాయం చేశాను. నేను చేసిన సహాయాన్ని ఎవరికి చెప్పను, ఆ ప్రభువే నా చేత సహాయం చేయించాడని అనుకుంటాను. ప్రపంచంలోని ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఏసుక్రీస్తు ప్రభువు దీవెనలు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, పాస్టర్ రమేష్, నకరికల్లు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, సత్తనపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నాయకులు రఫీ, పూర్ణ, సత్యం, నక్క వెంకటేశ్వర్లు, మీరవలి, కొదముల శ్రీనివాసరావు, కొదముల మహేష్, ముప్పాళ్ళ మహేష్, కొదముల నాగేశ్వరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.