ప్రజల హక్కులను కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వం

  • ఓటమి భయంతో ఓట్ల ప్రక్రియలో అవకతవకలు
  • చెట్టు పేరుతో, నియోజకవర్గం పేరుతో ఓటు నమోదు చేయటం సిగ్గుచేటు
  • ప్రజలు ఎప్పటికప్పుడు ఓట్లను సరిచూసుకోవాలి
  • 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును పొందాలి
  • అధికారులు స్వతంత్రంగా విధులు నిర్వహించాలి
  • జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వైసీపీ ప్రభుత్వం ఓటమి నుంచి తప్పించుకోవటానికి చివరి ప్రయత్నంగా ఓట్ల ప్రక్రియలో అవకతవకలకు పాల్పడుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అడుగడుగునా కాలరాస్తుందని ఆయన మండిపడ్డారు. ఆదివారం శ్రీనివాసరావుతోటలో 22వ డివిజన్ టీడీపీ, జనసేన అధ్యక్షులు షేక్ నాగూర్ , సయ్యద్ షర్ఫుద్దీన్ ల ఆధ్వర్యంలో జరిగిన ఓటు నమోదు కేంద్రాన్ని నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బోనబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓట్ల ప్రక్రియలో దోషాలు ఉన్నాయని మండిపడ్డారు. చెట్టు పేరుతో , నియోజకవర్గం పేరుతో ఓటు నమోదు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చన్నారు. తప్పుల్లేని ఓట్ల జాబితాను రూపొందించటంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. అధికారులపై వైసీపీ నేతల ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా విధులు నిర్వహించే పరిస్థితులుండాలన్నారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను ఉపయోగించకూడదన్నారు. ఓట్ల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్రను కలిసి పూర్తి నివేదికను అందచేసినట్లు బోనబోయిన శ్రీనివాస్ తెలిపారు. నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ వైసీపీని ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరన్నారు. ఆంద్రప్రదేశ్ చరిత్రలోనే జగన్ రెడ్డి లాంటి దుర్మార్గ ముఖ్యమంత్రి లేడన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ వికటట్టహాసం చేస్తూ వికృతానందం పొందే శాడిస్ట్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటు హక్కు అనే ఆయుధంతో జగణాసురిడిని వధించాల్సిన గురుతర బాధ్యత ప్రజలపై ఉందన్నారు. 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు తమ ఓటు ఉందొ లేదో సరిచేసుకోవాలని నేరేళ్ళ సురేష్ అన్నారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు, జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, నగర కార్యదర్శి బండారు రవీంద్ర, రెల్లి యువ నేత సోమి ఉదయ్, పులిగడ్డ గోపి, కోలా అంజి, చెన్నం శ్రీకాంత్, గడ్డం రోశయ్య, కొలసాని బాలకృష్ణ, అలా కాసులు, గోవింద్, సుబ్బారావు, స్టూడియో బాలయ్య, చిరంజీవి, శెట్టి శ్రీను, నండూరి స్వామి, టీడీపీ నేతలు పూసల శ్రీను, చింతకాయల వెంకట సాయి, మస్తాన్ వలి, బియ్యం శ్రీను, జనసేన పార్టీ ఐ టీ టీమ్ సభ్యులు సాయి కుమార్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.