రంగా మరియు సావిత్రిలకు ఘన నివాళులు

విజయవాడ, పేదల పాలిట పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా, అదేవిధంగా మహానటి సావిత్రి వర్ధంతి సందర్భంగా ఇరువురికి నివాళులు అర్పించిన విజయవాడ 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష. ఈ సందర్భంగా తిరుపతి అనూష మాట్లాడుతూ రంగా చనిపోయి నేటికి 35 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈరోజుకి అనేక పార్టీలవాళ్ళు, అనేక సామాజిక వర్గాలవాళ్లు రంగాని గుండెల్లో పెట్టుకునే వాళ్లు ఉన్నారు అంటే ఆయన గొప్పతనం గురించి నేను మాట్లాడే అంత గొప్ప దానిని కాదు, అదేవిధంగా రంగా పేరు తలుచుకోవడానికి ఎటువంటి అర్హత లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ఆర్సిపి పార్టీ వ్యక్తులు. ఈరోజున చూస్తా ఉంటే రంగా వర్ధంతి, జయంతి అనగానే ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్లు అంత ఇంత హంగామా కాదు. మీకు నిజంగా సిగ్గు శరం అనేది ఉంటే విజయవాడకి రంగా పేరు పెట్టమని అనేక సామాజిక వర్గాల వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డికి విన్నవిస్తే పట్టించుకోని మీరు ఈ రోజున రంగా వర్ధంతి అనగానే, రంగా జయంతి అనంగానే ఆయన ఫోటోలకి దండలేసే మీకు సిగ్గుందా అని నేను ప్రశ్నిస్తున్న. మీరు కేవలం రంగాని ఒక ఓట్ బ్యాంక్ గానే వాడుకుంటున్నారు. ఇక ఈరోజున బడుగు బలహీన వర్గాలకి పేదల పాలిట పెన్నిధిగా ఉన్న మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి, సందర్భంగా, అదేవిధంగా ఎమర్జెన్సీ టైంలో ఇండియన్ ఆర్మీకి తన నిలువెత్తు బంగారం ఇచ్చేసిన మహోన్నతమైన వ్యక్తి మహానటి సావిత్రి వర్ధంతి సందర్భంగా 42 వ డివిజన్లో జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పించాము. ఈ కార్యక్రమంలో ప్రసాద్, సుదబత్తుల సూరిబాబు, మహమ్మద్ ఆయాజ్, మొవ్వ బేబీ, రాజేశ్వరి, ఎస్.కె అల్లా బక్షు, మరెళ్ల కొండలరావు, హనుమంతరావు, వెంకట్రావు, పెద్ది సతీష్, కటకం బాబు, వల్లి, రవికుమార్, దాసి రామ్మోహన్, దాసరి మూర్తి రాజు, రామకృష్ణ, ఆలీ, కానాల వినోద్, యర్రజు సత్యనారాయణ, గోరుశుపూడి గోవింద్, శివాజీ, ఉడుత్త మణికంఠ, నాగరాజు, అడపా ప్రసాద్, దుర్గారావు, తులసి మురళి, మండవల్లి రఘు, తంగా రవి, పాతకోట ఆదిత్యరెడ్డి, తోటకూర గోపి తదితరులు పాల్గొన్నారు.