రైతులకు న్యాయం జరగాలి: పడాల అరుణమ్మ

గజపతినగరం నియోజకవర్గం: గజపతినగరం మండలం, పాతబగ్గంలో గల ధాన్యపు కొనుగోలు కేంద్రం (మిల్లు) ను మాజీ మంత్రి వర్యులు, జనసేన పార్టీ పిఎసి సబ్యులు శ్రీమతి పడాల అరుణమ్మ, పడాల శరత్, మండల పార్టీ అధ్యక్షుడు మునకాల జగన్నాధరావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మామిడి దుర్గాప్రసాద్, సాయిలోకేష్, అనంత్ తధితరులు పరిశీలించడం జరిగింది. అక్కడ రైతులు చెప్పిన విషయాలు. క్వింటాకు అధనంగా 5 కిలోలు తీస్తున్నారని, క్వింటాకు ధాన్యం దించదానికి 12 రూపాయిలు తీసుకుంటున్నారని, ధాన్యం తునికలలో తేడా వున్నాయని రైతులు వాపోయారు. ఈ విషయాలను మిల్లర్ను అరుణమ్మ అడగగా రైతులు ధాన్యం బాగో లేవని కావున అధనంగా తీస్తున్నామని చెప్పారు. క్వింటాకు దించడానికి ఎందుకు 12 రూపాయలు వసూలి చేస్తున్నారని అడగగా మమ్మల్ని వసూలు చేసుకోమన్నారని చెప్పారు.