ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం 26వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం శివనాథపాలెం పంచాయతీలో, తొట్టంబేడు పంచాయతీలోని శ్రీరామ్ నగర్ కాలనీలో బుధవారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ నాయకులు తోట గణేష్, పేట చిరంజీవి, కవిత, శారద, మునయ్య జనసైనికులు దినేష్, హేమంత్, శివ, వంశీ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.