జనసేన విజయ యాత్ర – ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్ 28వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా రేణిగుంట పట్టణంలో జి.యం.స్ట్రీట్ లో శుక్రవారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు సుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. ప్రధానంగా త్రాగు నీరు 10-15 రోజులకి ఒకసారి మాత్రమే వస్తున్నాయని. నీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు మహిళలు తెలిపారు. త్వరలో జిల్లా కలెక్టర్ ని కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వినుత హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, పార్థసారధి, నాయకులు నగరం భాస్కర బాబు, పూర్ణయ్య, నాథ ముని, శ్రీనివాసులు, చిన్న, భూపతి, జ్యోతి కుమార్, వీర మహిళలు అనురాధ, గంగా, మాజీ ఎంపీటీసీ జయలలిత, జనసైనికులు శంకర్, కుమార్, రాజు, సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు.