చల్లపల్లి జనసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

అవనిగడ్డ నియోజకవర్గం: చల్లపల్లి మండల జనసేన ఆధ్వర్యంలో సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా చల్లపల్లి మండల జనసేన పార్టీ కేలండర్ ని జనసేన నాయకులు ఆవిష్కరించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మత్స్యకార విభాగ రాష్ట్ర కార్యదర్శి లంకే యుగంధర్, కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, జనసేన నాయకులు బచ్చు వెంకట్ నాధ్, జనసేన పార్టీ – టీడీపీ సమన్వయ కర్త చెన్నగిరి సత్యనారాయణ, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు అంకాని మహేంద్ర, కే.ఎస్.ఎస్ అవినిగడ్డ అధ్యక్షులు గాజుల తాతారావు, చల్లపల్లి మండల అధ్యక్షులు చోడగం విమల్ కృష్ణా, అవనిగడ్డ నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ సూదాని నందగోపాల్, చల్లపల్లి మండల ఉపాధ్యక్షులు ఉరిమి మణికాంత్, మండల ప్రధాన కార్యదర్శి తోట మురళి కృష్ణ, మండల కార్యదర్శులు గోళ్ళ ప్రసాద్, బెల్లపు ప్రసాద్, నూకల సురేష్, చల్లపల్లి మండల సంయుక్త కార్యదర్శి ఏనుగు రత్తయ్య, లక్ష్మీపురం పంచాయతీ ఉప సర్పంచ్ మరియు లక్ష్మీపురం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు దాసరి సురేష్, జనసేన పార్టీ వెలివోలు గ్రామ అధ్యక్షులు కోనేరు శ్రీనివాసరావు, చల్లపల్లి టౌన్ అధ్యక్షులు బొందలపాటి వీరబాబు, పాగోలు గ్రామ అధ్యక్షులు ముక్కొళ్ళు రాజు, బొందలపాటి ప్రసాద్, కంతేటి చంద్రశేఖర్, పసుపులేటి రవికుమార్, పినిశెట్టి నిరంజన్, పసుపులేటి శ్రీను మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.