ఘనంగా విడివాడ రామచంద్ర రావు జన్మదిన వేడుకలు
తణుకు నియోజకవర్గం: తణుకు నియోజకవర్గ జనసేన కార్యాలయంలో సోమవారం ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు జన్మదిన వేడుకలు మరియు నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం అత్తిలి మండలం నుండి పలు గ్రామాలకు చెందిన సుమారుగా 150 మంది అత్తిలి మండలం అధ్యక్షులు దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వీరికి ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-01-at-4.53.49-PM-1-1024x576.jpeg)