పని ఒత్తిడి విద్యా బోధనలో ప్రమాణాలను దెబ్బ తీస్తోంది..

ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అంతటి గురుతర బాధ్యతలను నిర్వర్తిస్తున్న వారిని అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అందులో ప్రధానమైనది.. ప్రతి ఏడాది చాలా మంది ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్నారు, వారి స్థానంలో కొత్తవారిని నియమించే పరిస్థితి లేకుండా పోవడమే.

సకాలంలో డీఎస్సీ ప్రకటన ఇవ్వడం లేదు. ఈ భారం మిగతా ఉపాధ్యాయులపైపడి వాళ్లు సతమతమవుతున్నారు. ఈ అదనపు భారం మోయడం కష్టం. ఈ ఒత్తిడే విద్యా బోధనలో ప్రమాణాలను దెబ్బ తీస్తోంది. రిటైర్ అయిపోయిన ఉపాధ్యాయుల స్థానంలో కొత్త వారిని నియమించి యువతకు ఉపాధి కల్పించడంతోపాటు, టీచర్లపై ఒత్తిడి తగ్గించాలని వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.