అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి

బొబ్బిలి నియోజకవర్గం: అంగన్వాడీల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని గత 22 రోజులుగా జరుగుతున్న వారి రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గంలో జరిగిన 22వరోజు సమ్మెలో అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా మాట్లాడుతున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు. బాబు పాలూరు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో మీ అందరి ఓట్లు కోసం నోటికొచ్చిన హామీలిచ్చిన జగన్, ఈ రోజు మాట తప్పి తన మడమ‌ తిప్పి అంగన్వాడీలు అడుగుతున్న న్యాయపరమైన డిమాండ్లను గురుంచి కనీసం ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల్లో మాట్లాడడానికి కూడా అనుమతించకపోవడమే కాకుండా తన పార్టీ ఎమ్మెల్యేలు అంగన్వాడీల గురుంచి చాలా నీచంగా మాట్లాడుతున్నా వారిని ముఖ్యమంత్రి వారించకపోవడం దారుణమని అన్నారు. మరో 90 రోజుల్లో ఈ మాయదారి ప్రభుత్వం దిగిపోయి, మన జనసేన+తెదేపా ప్రజా ప్రభుత్వం రాబోతుందని, తప్పనిసరిగా మీ కనీస వేతనం మరియు ఇతర డిమాండ్లపై మన ప్రభుత్వం మీ సానుకూలంగా ఉంటుందని భరోసానిచ్చారు. 2018లో జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు మన బొబ్బిలికి వచ్చినపుడు మీ అంగన్వాడీ సభ్యులు కొందరు ఆయనను కలిసి జీతాలు గురుంచి మొరపెట్టుకుంటే, తక్షణమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంతో కేవలం 15 రోజుల్లోనే వేతనాలు పెంచే విధంగా ఒత్తిడి తీసుకురాగలిగారనే విషయాన్ని గుర్తు చేసారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారి హయాంలో మరింత జనరంజక పాలన రాబోతుందని, ధైర్యంగా ఉంటూ మీ ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగించండని, అంగన్వాడీలకు మా ఇరు పార్టీల మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచనా గంగాధర్, బొబ్బిలి నాయకులు పళ్లెం రాజా, రేవల్ల కిరణ్ కుమార్, వీర మహిళ రమ్య, జనసేన పార్టీ నాయకులు రాజు, రమేష్, జాన్, హరిచరణ్, అగూర్ శ్రీను, కాత విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.