అంగన్వాడీల నిరవధిక సమ్మెకు అతికారి దినేష్ మద్దతు
రాజంపేట నియోజకవర్గం: రాజంపేట మండలం, పాలెం గ్రామంలో జరిగిన అంగన్వాడీల నిరవధిక సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత 23 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలు రాజంపేట మండలం పాలెం గ్రామం వద్ద సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో బుధవారం జనసేన పార్టీ తరుపున సంపూర్ణ మద్దతును తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-03-at-6.04.45-PM.jpeg)