జనసేన ఆధ్వర్యంలో నిరుద్యోగ పోరాట యాత్ర

విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత చదువులు చదువుకొని ఉపాధి లేక నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న యువతకు ఉపాధి కల్పించాలంటూ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఆదేశాలతో పెందుర్తి జనసేన నాయకురాలు గొన్న రమాదేవి ఆధ్వర్యంలో గురువారం నిరుద్యోగ పోరాట యాత్ర నిర్వహించారు. లంకెలపాలెం జంక్షన్ నుండి ఉదయం భారీగా జనసైనికులు, నిరుద్యోగులు, యువకులతో పాదయాత్రగా మొదలై పరవాడ తహసిల్దార్ కార్యాలయం వరకు నడిచి వెళ్లారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్ శ్యాంకుమార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో గొప్పగా ప్రవేశపెట్టిన జీవోలను వేటిని సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలు కల్పించాలని జీవో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అతని బంధువులకు సంబంధించిన ఫార్మాసిటీలోని పరిశ్రమల్లో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. ఎంతో విలువైన భూములను అతి తక్కువ ధరలకు తీసుకొని, ప్రశాంతంగా ఉన్న గ్రామాలను కాలుష్యం బారిన పడేటట్టు చేసి, ఉన్న భూములను వ్యవసాయం చేసుకోవడానికి పనికిరాకుండా తయారుచేసి, నిర్వాసిత మరియు కాలుష్య బాధిత గ్రామాల్లోని యువకులకు ఉపాధి కల్పించకుండా వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. స్థానికంగా ఫార్మాసిటీ లో ఎన్నో పరిశ్రమలు ఉన్నప్పటికీ నిర్వాసిత గ్రామాల్లోని యువకులకు గాని ఫార్మా కాలుష్య బాధిత గ్రామాల్లోని యువకులు గాని ఎటువంటి ఉపాధి కల్పించకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందు, 80 వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ గొల్లవిల్లి సూరిబాబు, 77వ వార్డు ఇంచార్జ్ కాకి అప్పల రెడ్డి, 85వ వార్డు ఇంచార్జ్ గవర్ సోమశేఖర్, 64వ వార్డు ఇంచార్జ్ ముసలయ్య,94 వ వార్డు ఇంచార్జ్ పిన్నింటి పార్వతి, 15వ వార్డు ఇన్చార్జ్ ఎడ్లపల్లి కళా, 68వ వార్డు ఇన్చార్జి శాలిని, 87 వ వార్డు ఇన్చార్జి ఇందిరా ప్రియదర్శిని, లీగల్ సెల్ కళావతి, రూరల్ జిల్లా కార్యదర్శి సురేఖ, నర్సీపట్నం జిల్లా ఉపాధ్యక్షుడు చక్రవర్తి, మహిళా కోఆర్డినేటర్ లు కిరణ్ ప్రసాద్, త్రివేణి, శారీని, సుందరపు శ్రీను, ఆర్జిల్లి అప్పలరాజు, అప్పు సంపంగి, నర్సింగ్, ముత్యాలు, నాగు, అప్పికొండ మహేష్, గంజి శ్యాము, గొల్లవిల్లి శ్రీను, దాసరి త్రినాథ్, గొల్లవిల్లి అచ్చిబాబు, సుధా, మడక రమణ, బత్తిన రాముడు, అక్కిరెడ్డి శ్రీను, ఇందల ఏడుకొండలు, కాలపురెడ్డి బుజ్జి, మడక గౌరీ, మడక ప్రసాద్, నారాపిన్ని నాగేష్, రమేష్, అక్కిరెడ్డి శ్రీను, బలిరెడ్డి సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు.