మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన ముత్తా

కాకినాడ సిటి, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ చేస్తున్న సమ్మేలో భాగంగా కాకినాడ సిటిలో మునిసిపల్ వర్కర్స్ చేయుచున్న ఆందోళనా కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ వారిని కలిసారు. ఈ సందర్భంగ ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఈ అయిదు సంవత్సరాల కాలంలో ఈ వై.సి.పి ప్రభుత్వం మా ఇంటిపన్ను ఎంత పెంచిందీ, వీరి జీతాలు ఎంతపెంచింది అని అంటూ ఇంటిపన్నుని ఆస్థి విలువతో లెక్కకడుతూ దారుణంగా పెంచేసారే ఆ తరువాత నుండీ ప్రతి సంవత్సరం 5 శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నారే మరి దీనికి అనుగుణంగా వీరి జీతాలు ఎందుకు పెంచరో తెలియచేయాలని డిమాండ్ చేసారు. కాకినాడ మునిసిపాలిటీని కార్పోరేషన్ స్థాయికి పెంచి పరిధిని పెంచి వెయ్యిమందితో పనిపూర్తి చెయైంచాలని చుడటమేంటని నిలదీసారు. ఈ వెయ్యిమందిలో అన్ని సామాజిక వర్గ కులాల వాళ్ళూ శుభ్రం చేసే పనిచేస్తున్నారనీ నిన్నా మొన్నా జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్స్ మీట్లు పెట్టి లేని గొప్పలు చెప్పుకుంటున్నారనీ, మా నాయకుడు మూడురోజులు ఏంచెసారనీ అంటున్నారు, మీ నాయకుడు గంటసేపు ఏమీ చూడలేడు, వినలేడు కానీ మానాయకుడు ప్రతినిమిషం ప్రజల కష్టాలు వినడానికి వచ్చాడనీ తదనుగుణంగానే కాకినాడ సిటిలో చాలా మందితో కలిసి విషయాలను తెలుసుకున్నారనీ, ప్రతి ఊరిలో చాలామందిని కలుసుకుని విషయాలను తెలుసుకుంటున్నారనీ, మీనాయకుడు బటన్లు నొక్కడానికి బయటకి వస్తున్నాడని, పరదాల చాటున వచ్చి వెళ్ళారు కానీ సమ్మే చేస్తున్న మునిసిపల్ కార్మికులని కానీ, అంగన్వాడీలను కానీ, కాంట్రాక్ట్ లేబరు సమ్మెలు ఇవేవీ చూడలేదు లేదా ఆయనకు కనపడవన్నారు. చేసిన శంఖుస్థాపనలన్నీ పూర్తిచేసాం అని చెపుతున్నారు కదా ఎం.ఎల్.ఏ మరి దివంగత రాజశేఖర్ రెడ్డి శంఖుస్థాపన చేసిన కుంభాభిషేకం అభివృద్ధి పనులు ఏమైందీ అని అది కబ్జాకు గురవ్వలేదా అని ప్రశిస్తున్నా అన్నారు. మరి అదే రాజశేఖర్ రెడ్డి, ముత్తా గోపాలకృష్ణతో కలిసి శంఖుస్థాపన చేసిన వీళ్ళందరికీ ఇళ్ళు కట్టి ఇస్తానన్న రెల్లి కాలనీ దాని సంగతి ఏంటని ప్రశ్నించారు. పూర్తిచేసిన వాటికి అభినందనలు అనీ, పూర్తిచేయనివాటి గురించి చెప్పండన్నారు. అన్నీ ప్రజలు చూస్తున్నారనీ, ఆరునెలల క్రితం చెప్పడం జరిగిందనీ వచ్చే ఎన్నికలలో గ్లాసు గుర్తు పోటీ చేసి ఫ్యాను గుర్తు ఓడిపోతాదని తొందరేమీ లేదనీ సమయం ఆసన్నమయ్యిందన్నారు. మాపార్టీలో ట్రాన్స్ఫర్లు ఉండవనీ ఇక్కడి వాళ్ళే గ్లాసు గుర్తుపై పోటీ చేస్తారనీ, పార్టీ ఎవరిని ఆదేశిస్తే వాళ్ళే పోటీ చేస్తారన్నారు. గదుల్లో కాకుండ ఈ కార్మికుల సమక్షంలో మాట్లాడుతున్నాం సరిగ్గా 60 రోజులలో ఇదే ప్రజలు తమ సమాధానం మీకు చూపెట్టబోతున్నారన్నారు.