చెంచుల కుటుంబాలతో ముత్తా మాటామంతి

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఎన్.టి.ఆర్ బ్రిడ్జ్ వద్ద వార్ఫ్ రోడ్డులో నివసించే చెంచుల కుటుంబాలని కలిసి మాటామంతి జరిపారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ వారిని కలిసి తమ నాయకులు పవన్ కళ్యాణ్ నగరంలో నివీసిస్తున్న వీరిని కలిసి బాగోగులు, స్థితిగతులని తెలుసుకోవాలిసిందిగా ఆదేశించారని తెలియచేసిన పిదప వారు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమ ఉనికిని గుర్తించిన పవన్ కళ్యాణ్ కి కృతఙ్ఞతలు తెలిపారు. కేవలం ఎన్నికల సందర్భాలలో తప్ప మిగిలిన నాయకులు తమని పట్టించుకోడంలేదని విచారం వ్యక్తం చేసారు. చెంచులమైన తాము ఇక్కడ కులవృత్తితో కుటుంబాలని పోషించుకుంటున్నామనీ, కానీ నేడు యాంత్రికీకరణ వల్ల తమపనులకు గిరాకీ తగ్గి కుటుంబపోషణ కష్టమైందని బాధను వ్యక్తీకరించారు. తాము షెడ్యూలు ట్రైబల్స్ అయినప్పటికీ తమ పిల్లలకు చదువులలో ప్రోత్సాహంగానీ, తమకు సంక్షేమంగానీ దొరకడంలేదన్నారు. ఇక్కడ రోడ్డు విస్థరణ కార్యక్రమంలో ఉన్న ప్రదేశం కూడా పోయి ఇరుకుగా మిగిలిందనీ వాపోయారు. ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఈ వై.సి.పి ప్రభుత్వం కులవృత్తులని నిర్లక్ష్యం చేసిందనీ, ఆదరణ, ప్రోత్సాహం ఇవ్వకుండా వదిలివేసిందనీ, మాటల్లో తప్ప వెనుకబడిన వర్గ కులాలకి చేసింది శూన్యమనీ రాబోయే తమ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల ఉమ్మది ప్రభుత్వంలో వీరికి తగిన స్థలాన్ని, సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. చెంచుల అభివృద్ధికి రక్షణకి తాము వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు.