సంక్రాంతికి టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం

  • నూజివీడులో జరిగిన ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ అల్టిమేటం

నూజివీడు టౌన్: సంక్రాంతికి టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు అందించక పోతే నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఇళ్ళు ముట్టడి కార్యక్రమం చేపడతామని ఆదివారం నూజివీడు లో జరిగిన ప్రెస్ మీట్ లో జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ హెచ్చరించారు. ఈ సంధర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ నూజివీడు పట్టణంలో నిర్మించిన టిట్కో గృహాలు తక్షణమే పేదలకు అందించాలని, గత ప్రభుత్వ హయాంలో నూజివీడు పట్టణంలో 3070 గృహాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం జరిగిందనీ అన్నారు. అయితే 2668 నిర్మాణాలు 80 శాతం పూర్తి చేసి మిగిలిన 20 శాతాన్ని పూర్తి చేసి పేదలకు ఇల్లు ఇచ్చే సందర్భంలో ప్రభుత్వం మారింది అని తెలిపారు. గడిచిన నాలుగు సంవత్సర కాలంగా మిగిలి ఉన్న 20 శాతం పనులు పూర్తి చేసి పేదలకు అందించవలసిన ఈ ప్రభుత్వం ఇంతవరకు వాటి పై శ్రద్ధ పెట్టడం లేదని ఇప్పటి వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేకసార్లు టిట్కో గృహాలు పేదలకు అందించాలని కలెక్టర్ గారి కి, సబ్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాలు అందిస్తున్న కూడా నిర్మాణాలు పూర్తి చేయటం లేదని అన్నారు. ఎప్పుడు అడిగినా దసరాకి దీపావళి సంక్రాంతి అని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు తప్ప ఇచిన్న పాపాన పోలేదు అని అన్నారు. అసలు టిట్కో గృహాల వాస్తవ పరిస్థితిని గతం లో అనేక సార్లు జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెలుసుకోవటం జరిగిందని తెలిపారు. గతంలో గృహాలకు డబ్బులు కట్టించుకునేటప్పుడు టిట్కో గృహాల కలిగిన ఏరియాలో రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పార్కు స్కూలు ఆసుపత్రి లాంటి సౌకర్యాలు కలిగిస్తామని పేదల దగ్గర నుంచి సుమారు 20 కోట్ల రూపాయలు వసూలు చేశారు కానీ నేటికీ కూడా గృహాలు అందించకపోవడం సిగ్గుచేటు ఎమ్మెల్యే చేతకానితనం మాత్రమే ఇల్లు ఇవ్వకపోగా లబ్ది దారులు కు బ్యాంక్ నుండి డబ్బులు కట్టాలని నోటీసులు పంపుతూ హింసిస్తున్నారని తక్షణమే లబ్ధిదారులకు ఇల్లు అప్పచేపలని డిమాండ్ చేస్తున్నాం ..ఇవ్వకపోతే జనసేన పార్టీ తరుపున నూజివీడు లో లబ్ధిదారులతో ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో పార్టీ నూజివీడు మండల అధ్యక్షులు యర్రంశెట్టి రాము, నూజివీడు మండల ప్రధాన కార్యదర్శి చేరుకుపల్లి కిషోర్, నూజివీడు టౌన్ నాయకులు ముమ్మలనేని సునీల్ కుమార్, వీరమహిళ రంగు ధనలక్ష్మీ, అగిరిపల్లి మండల ప్రధాన కార్యదర్శిలు ఎలవర్తి సువర్ణబాబు, కోరాకుల ప్రసాద్, కళ్లే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.