శ్రీకాళహస్తి గడ్డ జనసేన అడ్డా

  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా శ్రీకాళహస్తిలో జనసేన సిద్దం
  • నియోజకవర్గంలో 1,500 మందితో బూత్ కమిటీ సభ్యులు సిద్దం
  • ప్రతి 50 ఓట్లకి ఒక జనసేన వాలంటీర్ కి బాధ్యత

శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలో నియోజకవర్గ పరిధిలోని మండల, పట్టణ, బూత్ కమిటీ సభ్యులు 1,500 మందితో శ్రీకాళహస్తి పట్టణంలోని రోటరీ క్లబ్ నందు సమావేశం ఏర్పాటు చేసి, రానున్న ఎన్నికల్లో గ్రామ స్థాయిలో ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అని దిశ నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి 50 ఓట్ల కి ఒక జనసేన వాలంటీర్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో పంచాయతీ స్థాయిలో 10 మంది తో కూడిన పంచాయతీ కోఆర్డినేటర్ల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రానున్న 2 నెలలు ప్రతి జనసైనికుడు అహర్నిశలు కష్టపడాలని, చివరి ఓటర్ కూడా మిస్ అవ్వకుండా బూత్ లో ఓటు వేసే విధంగా ఒక టీం స్పిరిట్ తో సమన్వయంతో పని చెయ్యాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి అందించే దిశగా జనసేన పార్టీ నిలబడ్డ ప్రతి దగ్గర అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే ప్రతి జనసైనికుడు కోరిక నెరవేరుతుందని తెలిపారు. పార్టీ కోసం పని చేసే ప్రతి జనసైనికుడుని పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని. అధికార పార్టీ చేసే దౌర్జన్యాలు ధైర్యంగా ఎదుర్కోవాలని కోరారు. ప్రతి ఓటరు వద్దకి వెళ్లి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆవశ్యకత వివరించి ప్రతి ఓటు జనసేనకి పడేట్టు కృషి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, కిరణ్ కుమార్ రామిశెట్టి, తోట గణేష్, పేట చంద్ర శేఖర్, చిన్నతోట నాగరాజు, భాగ్య లక్ష్మి, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, మండల ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు, పంచాయతీ, బూత్ కమిటీ సభ్యులు, వీరమహిళలు పాల్గొన్నారు.