అంగన్వాడీలు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలియజేసిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు నియోజకవర్గంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అంగన్వాడిల పై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి అంగన్వాడి అనుబంధ సంఘాలు ఈరోజు పిలుపునిచ్చాయి. దీంతో ఫైర్ స్టేషన్ సెంటర్లో అంగన్వాడి మహిళలు బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. కొంతమంది ఆందోళన చేస్తున్న అంగన్వాడి మహిళలు స్పృహతప్పి కింద పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రెడ్డి అప్పలనాయుడు వెంటనే వాళ్లను పరామర్శించి వాళ్లకు ఏలూరు జనసేన పార్టీ నుండి సంఘీభావాన్ని తెలియజేశారు. అంగన్వాడీలను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా జనసేన, తెలుగుదేశం ఇతర వామ పక్షాల పార్టీలు సంఘీభావం తెలిపాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే అంగన్వాడీలు మొత్తం సీఎం జగన్ ప్యాలెస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీని చేపట్టారు.