జనసేన కండువా కప్పుకున్న నెల్లిమర్ల వైయస్సార్ కాంగ్రెస్ యువజన నాయకుడు

నెల్లిమర్ల నియోజకవర్గంలో అంతకంతకు ప్రజాదరణ పొందుతున్న జనసేన పార్టీ, జనసేన తీర్థం పుచ్చుకుంటున్న వైసీపీ నాయకులు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో యువజన నాయకుడుగా పనిచేస్తున్న రవ్వ నాని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వచ్చాక ఎటువంటి అభివృద్ధి జరగలేదు మరియు రాష్ట్రంలో జరుగుతున్న కక్షపూరిత రాజకీయాలను సహించలేక ప్రస్తుత పరిస్థితులపై విసుగు చెంది పార్టీ నుంచి విడిపోవడం జరిగింది. అదే క్రమంలో రాష్ట్రంలో జనసేన పార్టీకి ఉన్న ప్రజాధరణ చూసి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి మరియు నెల్లిమర్ల నియోజకవర్గంలో శ్రీమతి లోకం మాధవి నిత్యం ప్రజాక్షేమం కోసం పాటుపడుతున్న విధానము, రైతులకు పేదలకు మాధవి ఇచ్చే హామీలు మరియు యువతకి ప్రాధాన్యత మొదలగు విషయాలు నచ్చి రవ్వ నాని బుధవారం తన అనుచర గణంతో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో నెల్లిమర్ల మండలం రామతీర్థం జంక్షన్లో ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమతి లోకం మాధవి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వాగ్దానాలు ఎలా విఫలం అయ్యాడో, అలాగే చీకటి జీవోలు తీసుకొచ్చి ఈరోజు అంగన్వాడీలనే ఎస్మా చట్టం ద్వారా ఎలా ఇబ్బంది పెడుతున్నాడు, అలాగే ఇళ్ల పట్టాల మీద మోసాలు అభివృద్ధికి నోచుకోని నగర పంచాయతీ పారిశుద్ధ్యం, త్రాగునీరు, రోడ్డు అవస్థలు నవరత్నాలు అని చెప్తే రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా నయవంచన చేస్తున్నాడు అందరికీ తెలిసిన విషయమే. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కచ్చితంగా యువతకు ఉద్యోగ అవకాశాలకు పెద్ద పీట వేస్తామని అలాగే చేతివృత్తులను ప్రోత్సహిస్తామని రైతుల్ని పేదలని ఆర్థికంగా చూస్తే అభివృద్ధి పరుస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు జనసైనికులు, వీరమహిళలు హాజరవ్వడం జరిగింది.