చింతలూరు గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గం నుండి పలువురు జనసేనలో చేరిక

కొత్తపేట: ఆలమూరు మండలం, చింతలూరు గ్రామంలో ఎస్సీ సామాజికవర్గం నుండి పలువురు జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి నియోజకవర్గ ఇంఛార్జి బండారు శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి అహ్వనిచడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గంలో బండారు శ్రీనివాస్ గారి గెలుపు కోసం జనసేన పార్టీకి తమ సహకారం అందిస్తామని తెలియచేయడం జరిగింది. పార్టీలో చేసిన వారు గంటా స్వయం ప్రకాష్, గంటా రాజా, పెయ్యల వెంకటరమణ, తూలూరి శేకర్, నేరేడుమిల్లి రాజేష్. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు తాళ్ళ డేవిడ్, సంగీత సుభాష్, బొక్కా ఆదినారాయణ, దొంగా వెంకట సుబ్బారావు, మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, చేకూరి కృష్ణంరాజు, కంటంశెట్టి చంటి, తోట స్వామి, గ్రామ అధ్యక్షులు దేశబత్తుల సత్యనారాయణ, గారపాటి త్రిమూర్తులు, పడాల అమ్మిరాజు, గుత్తుల నాగేశ్వరరావు, తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.