అనంతపురంలో మన ఊరు- మన ఆట

అనంతపురము, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు “మన ఊరు- మన ఆట” సంక్రాంతి వేడుకల్లో భాగంగా అనంతపురము నియోజకవర్గం నారాయణపురము పంచాయితీలో ముగ్గుల పోటీలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురం నియోజకవర్గ ఇన్చార్జ్ టిసి వరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలో పాల్గొన్న వీర మహిళలకు అనంతపురం నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. జనసేన మూల సిద్ధాంతం సంస్కృతలను కాపాడే సంప్రదాయం. వందలాదిగా అనంతపురం నియోజకవర్గ వీర మహిళలు ముగ్గుల పోటీలలో ఉత్సాహంతో ఉల్లాసంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వచ్చే ఎన్నికలలో వైసిపి ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలు ఆటాడుకునేందుకు సిద్ధంగా ఉన్నారని “మన ఊరు – మన ఆట” కార్యక్రమం ద్వారా స్పష్టంగా అర్థమైంది. జనసేన రాయలసీమ ప్రాంతీయ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత, నగర కార్యదర్శిలు శ్రీమతి జక్కిరెడ్డి పద్మావతి, నగర కార్యదర్శి లాల్ స్వామి, వల్లంశెట్టి వెంకటరమణ, చిరు అందరూ కలిసి సమిష్టిగా దగ్గరుండి ఏర్పాట్లు అన్ని చూసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, ఈశ్వరయ్య, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా లీగల్ సేల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శిలు శ్రీ రాపా ధనంజయ్, శ్రీసంజీవ రాయుడు, కిరణ్ కుమార్, సిద్దు, శ్రీమతి జయమ్మ, అవుకు విజయకుమార్, ముప్పూరి కృష్ణ, నగర ఉపాధ్యక్షులు గ్రంధి దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శులు శ్రీచక్రపాణి, హుస్సేన్, నగర కార్యదర్శులు కుమ్మర మురళి, అంజి, సంపత్, వడ్డే వెంకటేష్, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్ కుమార్, వీరమహిళలు శ్రీమతి అనసూయ, శ్రీమతి అనిత, శ్రీమతి అంజలి, నాయకులు ఎంవి.శ్రీనివాస్, ఎస్.నజీర్, రామ్మోహన్, చిరు, నాగార్జున, పెండ్లిమర్రి శ్రీనివాసులు, బళ్లారి అనిల్, హిద్దు, హరి, వంశీ, దేవరాయల్ విజయ్, భూపతి మరియు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.