పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట

ముమ్మిడివరం నియోజకవర్గం: సంక్రాంతి సంబరాలు భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ఐ. పోలవరం మండలం జి. వేమవరం గ్రామం నల్లావారిమెరకలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ముగ్గులు పోటీలో పాల్గొన్న వారికీ ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా నగదు బహుమతి, మరియు పాల్గొన్నవారికి కూడా నగదు బహుమతి పితాని బాలకృష్ణ అందచేశారు. ఈ సందర్బంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరకి సంక్రాతి శుభాకాంక్షలు తెలిపి, రాబోయే రోజులలో పార్టీ తరుపున మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాము అని పార్టీ శ్రేణులుకు పిలుపునివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తెనదివి, జి. వేమవరం జనసేన నాయకులు, గ్రామస్తులు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.