ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన గునుకుల కిషోర్, జానీ భాయ్

నెల్లూరు: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొంది కోలుకుని ఇంటికి తిరిగివచ్చిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కృష్ట చైతన్య విద్యా సంస్థల అధినేత, రెడ్ క్రాస్ ఛైర్మన్ పార్టీలకతీతంగా మంచి మనిషి, సేవా తత్పరుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి పరామర్శించడం జరిగింది. ప్రమాదం జరిగిన మరుసటి రోజు తెల్లవారుజాము నుంచి వందలాది ఫోన్స్ కాల్స్, మా సార్ ని మీరు కాపాడారు. ఆయన మాకు ఎంతో సహాయం చేశారని ఎంతో మంది ప్రశంసించి అభినందనలు తెలిపారు. మీరు చేసిన పుణ్యమే మిమ్మల్ని కాపాడిందని పరోపకారం మహాధర్మంగా భావించే మీ లాంటి వారికి భగవంతుడు ఏమీ కానివ్వరనీ, వీలైనంత త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రం లోకి తిరిగి రావాలని కాంక్షించారు. చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో వీరితోపాటు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేసిన ప్రశాంత్ గౌడ్, మస్తాన్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.