కవిటిలో బెంతు, ఒరియాల నిరసన

ఇచ్చాపురం: బెంతు ఒరియాలకు గడచిన ఇరవై సం.లుగా జరుగుతున్న అన్యాయానికి నిరసనగా బెంతో ఒరియాలు కవిటి హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద బైక్ ర్యాలీ ప్రారంభం చేసి కవిటి, కంచిలి, ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కులధ్రువీకరణ పత్రాలు రెవిన్యూ శాఖ వారు బెంతో ఒరియాలకు జారిచేయని కారణంగా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఉన్నత రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వారు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ల కౌన్సిలింగ్ లలో అనర్హులుగా మిగిలిపోయారు. మరియు కులధ్రువీకరణ లేని కారణంగా బెంతో ఒరియా విద్యార్థులకి ప్రభుత్వం అందించే ఫీజ్ రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వాలు మారిన ప్రతీ సారి కమిటీలు వేసి నివేదికలు బహిర్గతం చేయకుండా కాలయాపన చేసి మోసం చేస్తున్నారని వాపోయారు. కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లో నిజమైన బెంతో ఒరియాలు నివసిస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయక కార్యదర్శి వారు జారీ చేసిన నివేదికలను కూడా తహసీల్దార్ కి చూపించి అందించారు. ఈ ప్రాంతంలో బెంతో ఒరియాలు ఉన్నారని ఎన్ని నివేదికలు రెవిన్యూ శాఖ వారికి చూపించినా సరే తమ కులం మీద ప్రభుత్వంకి తప్పుడు నివేదికలు స్థానిక రెవిన్యూ శాఖ వారు పంపిస్తున్నాను అని ఇకనైనా దయచేసి ఈ కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లో నిజమైన బెంతో ఒరియాలు నివసిస్తున్నారు అని మేము అందజేసే నివేదికలను ప్రభుత్వ ఉన్నతాధి కారులకు పంపించి మాకు కులధ్రువీకరణ మరియు నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆర్ ఐ కు ప్రాధేయ పడ్డారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూర్చొని రెవిన్యూ డిపార్ట్మెంట్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ప్రభుత్వం స్పందించక పోతే మేము చేసే ఈ శాంతి యుత పోరాటంను ఉదృతం చేస్తాము హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెంతో ఒరియా ప్రతినిధులు, యువత పాల్గొన్నారు.