తిరుపతి ఓటర్ల తుది జాబితా వాయిదా వేయ్యండి – జనసేన

  • నిన్నటిదినం ఓఐఏఎస్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి అధికారులు లేని ఓటర్లను నమోదు చెయ్యకండి – కిరణ్ రాయల్ డిమాండ్..

తిరుపతి: కార్పోరేషన్ కమిషనర్ హరిత ను ఓటర్ల తుది జాబితా వాయిదా చెయ్యాలని గురువారం ప్రెస్ క్లబ్ లో జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, హేమకుర్, మునస్వామి, రాజేష్ ఆచారి, రమేష్ నాయుడు, కిషోర్, మనోజ్, వంశీలతో కలిసి కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఓటర్ల నమోదులో అక్రమాలకు పాల్పడినట్లు తేటతెల్లం అయిన నేపథ్యంలో ఓటర్ల తుది జాబితా తక్షణమే వాయిదా వేయాలని, తిరుపతి లడ్డుకు ఎంత ఫేమస్సో దొంగ ఓట్లు నమోదుకు అంతే ఫేమస్ అని, తిరుపతిలో ఒక ఓటరుకు ముగ్గురు తల్లులను నమోదు చేశారని, దొంగ ఓట్లు నమోదులో తిరుపతిలో ఉన్నతాధికారులే కీలకంగా వ్యవహరించారని, దొంగ ఓట్లు నమోదులో అప్పటి కమిషనర్ గిరీషా ఒకరే కాదు.. ఇంకా 15 మంది అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, తిరుపతిలో దాదాపు 45 వేల దొంగ ఓట్లు ఉన్నాయని, నగర పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల ఓట్లు తిరుపతిలో, తిరుపతిలోని వారిని పక్క నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేశారని, దొంగ ఓట్లతో గెలుపొందాలని వైకాపా కుట్రలు పన్నుతున్నారని, నాలుగు రోజులలో విడుదల చేయనున్న ఓటర్ల జాబితా ను దయచేసి వాయిదా వెయ్యాలని, తిరుపతి ఎంపీ ఒక్క తిరుపతి కే ఎంపీ కాదని, మొత్తం రాయలసీమకే ఎంపీ అని, రాయలసీమ ప్రజలందరూ ఆయనకు ఓట్లు వేసి గెలిపించాలని కిరణ్ ఏద్దేవా చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి అధికారులు లేని ఓటర్లను ఉన్నట్లు నమోదు చేసినట్లయితే, నిన్నటిదినం ఓ ఐఏఎస్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారని అలాంటి అవమానాలకు ఉన్నతాధికారులు గురి కావద్దని మరొక్కసారి ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని జనసేన నేతలు అధికారులను హెచ్చరించారు.