నాలుగున్నరేళ్లుగా అమరావతిలో అసువులు బాసిన రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే

అమరావతి విచ్చిన్నంతో 17 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ముఖ్యమంత్రి గండి కొట్టరాని గుంటూరు జిల్లా తెలుగుయువత అద్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం 1500వ రోజు పూర్తి చేసుకున్న సందర్భముగా అమరావతి పరిరక్షణ యువజన జెఏసి కన్వీనర్ రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో రైతులకు సంఘీభావంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తొలుత బృందావన్ గార్డెన్స్ నుండి ప్రారంభమైన ర్యాలీ లక్ష్మీపురం లాడ్జి సెంటర్ శంకరవిలాస్ మీదగా హిందుకళాశాల సెంటర్లో గల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకొని అమరజీవి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద ముగించి తెలుగుతల్లి విగ్రహానికి నివాళులర్పించి అమరావతి రాజధాని ఉద్యమంలో మానసిక వేదనతో అసువులు బాసిన రైతులకు శ్రద్ధాంజలిగా మౌనం పాటించారు. ఈ సందర్భంగా యువజన జెఏసి కన్వీనర్ రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ విద్యార్థి జెఏసి గుంటూరులో చేప్పట్టిన బైక్ ర్యాలీ 1500 రోజుల అమరావతి రైతులు మహిళల వీరోచిత పోరాటానికి మరియు రాజధాని కోసం అసువులు బాసిన అమరవీరులకు ఇటీవల రాజధాని తరలింపు బాధతో ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన దళిత జెఏసి కన్వీనర్ గడ్డం మార్టిన్ లూథర్ కు అంకితం అని నాలుగున్నరేళ్లురా అమరావతిలో అసువులు బాసిన రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నవ నగరాల పేరుతో ఒక సెల్ఫ్ ఫైనాన్స్ కాపిటల్ గా సొంతంగా ఆర్ధిక వనరులు సమకూర్చుకోగల రాజధానిని నిర్మించి 17 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పనకు శ్రీకారం చుడితే వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక విచ్చిన్నం చేసి ఎపి యువతకు 17 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ముఖ్యమంత్రి గండి కొట్టరాని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో నేడు పట్టభద్రుల్లో 73 శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారని అన్నారు. యువజన జెఏసి సభ్యులు జనసేన నాయకులు ఆళ్ల హరి మాట్లాడుతూ ప్రాణసమాన మైన భూమిని రాష్ట్ర భవిష్యత్ కోసం ఇస్తే రాజకీయ కక్షల కోసం నాశనం చేయటాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండిస్తున్నారని రానున్న రోజుల్లో టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వం తో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కలల సాకారం అవ్వటం తధ్యమని అన్నారు.

  • ప్రత్యేక హోదా సాధన సమితి నేత షేక్ జిలాని మాట్లాడుతూ

రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ మాట్లాడుతూ అమరావతి అనేది తెలుగు వారి సంపద తెలుగువారి ఆత్మగౌరవ రాజధానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత జగన్మోహన్ రెడ్డి అమరావతిని కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినదే అని తప్పుడు ప్రచారం చేస్తూ ఇక్కడి నుంచి తరలించాలని ప్రయత్నాలు చేస్తున్న రైతులు ఎంతగానో పోరాడి ఇక్కడ నుండి అంగుళం కూడా కదిలించకుండా జగన్మోహన్ రెడ్డికి గట్టిగా 1500 రోజులుగా బుద్ధి చెబుతూ వచ్చారు అయితే అమరావతిలో అత్యధిక రైతులు బిసి ఎస్సి, ఎస్టీ మైనార్టీలే కావటం గొప్ప విషయం కాబట్టి ఈ రాజధాని బడుగు బలహీన వర్గాలకు సంబంధించినది వారి చేతిలో జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ఓటమి తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో మేధావుల ఫోరమ్ నేతలు భాష్యం నరసయ్య ,రైతు నాయకులు రావిళ్ల వెంకటయ్య, శ్రీనివాసరావు,వెలివెళ్ళి సుబ్బారావు,ప్రత్యేక హోదా సాధన సమితి నేత షేక్ జిలాని,అర్బన్ టిడిపి ప్రధాన కార్యదర్శి సౌపాటి రత్నం, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్,రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి కె ఎమ్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి బాజి మాస్టర్, రాష్ట్ర టిఎన్టియుసి కార్యదర్శి మధుమంచి శ్రీనివాసరావు, అమరవాతి ఉద్యమ మహిళా నాయకురాలు పేరం అనిత కుమారి, జనసేన యువజన నేతలు బందెల నవీన్ బాబు, మురళి, రాష్ట్ర బిసి సెల్ నాయకులు రాచకొండ లక్ష్మయ్య, ఐటిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పంచుమర్తి శేషు, తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్,అధికార ప్రతినిధులు సింగు గోపి, షేక్ షుకూర్, కార్యనిర్వాహక కార్యదర్శులు మన్నెం శ్రీనివాసరావు , కార్యదర్శులు వేమా విజయ్ కాంత్, పఠాన్ అత్తవుల్లా ఖాన్, మాచవరపు దాసు, గుంటూరు తూర్పు తెలుగుయువత ఉపాధ్యక్షులు ఉప్పుటూరి వెంకటేష్, పశ్చిమ ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్, ఉపాధ్యక్షులు పప్పుల రాంబాబు, గుంజి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్సులు కోలా మల్లికార్జునరావు, శ్రీపతి రాంబాబు, 48వ డివిజన్ టిడిపి అధ్యక్షులు చెరుకుపల్లి నాగరాజు, యువజన నాయకులు చిక్కాల శివ, శొంఠినేని అనిల్, షేక్ ఫర్వేజ్, శేషాద్రి సాంబశివరావు, సింగు నాగమల్లేశ్వర రావు, దుర్గా, సాయి పృథ్వి, టిడిపి జనసేన నేతలు మన్నవ వెంకటేశ్వరావు, కొల్లా నాగ సుబ్బారావు, రాముడు, మల్లెంపూడి శ్రీనివాస్, దేవభక్తుని శ్రీనివాస్, కార్మిక నేతలు తాడికొండ వెంకటేశ్వరావు, ఘంటా వెంకటేశ్వరావు, ఆంజనేయులు, స్వామి, ఆలా సతీష్ లతో పాటూ వివిధ పార్టీల ప్రజాసంఘాల రైతు యువత విద్యార్థి నేతలు అమరావతీ మద్దతు దారులు పెద్దసంఖ్యలో పాల్గొని అమరావతి మద్దుతుగా నినాదాలు చేసారు.