పిఠాపురంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

పిఠాపురం నియోజకవర్గం: జనసేన ఇంచార్జి ఉదయ్ ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవం పిఠాపురంలో గోపాల బాబా స్కూల్ పిల్లలు మధ్య ఘనంగా జరిపారు. పి.ఎస్.ఎన్.మూర్తి జనసేన పార్టీ తరుపున స్కూల్ పిల్లలకు పరీక్ష వ్రాత అట్టలు, పెన్స్, పెన్సెల్, పంచారు. ఈ సందర్భంగా హెచ్.ఎమ్. మాట్లాడుతూ స్కూల్ పిల్లల మీద మీరు చూపిస్తున్న శ్రద్ధ చాలా ఆనందకరమని హర్షం వ్యక్తం చేశారు. అదేవిదంగా జనంలోకి జనసేన టీమ్ ఆధ్వర్యంలో పిఠాపురం స్థానిక ఉప్పాడ బస్టాండ్ లో మహాత్మ గాంధీ గారిని పూలమాలతో సత్కరించడం మరియు స్వీట్ పంచడం జరిగింది. మరియు పిఠాపురం స్థానిక అంబేద్కర్ సెంటర్ లో డా. అంబేద్కర్ కి పూలమాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, టైల్స్ బాబీ, పెంకే జగదీష్, కసిరెడ్డి నాగేశ్వరావు, పెదిరెడ్ల భీమేశ్వరరావు, బీసీ నాయకులు శ్రీనివాస్, డా. కే ప్రసాద్, దేశిరెడ్డి సతీష్, ఓ. సాయి, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.