ఆర్టిసి సమస్యలపై గోడపత్రిక విడుదల

కాకినాడ సిటి: గణతంత్రదినోత్సవం రోజు సాయంత్రం జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ గారి సూచనలతో కాకినాడ సిటిలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్యాలయ సముదాయంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ముత్తా శశిధర్ ఆర్టిసి సమస్యలపై గోడపత్రికని విడుదల చేయగా, వాశిరెడ్డి శివ ఆర్టిసి కాంప్లెక్సులో మాట్లాడుతూ పేద ప్రజలు తమతమ గమ్యస్థానాలకు ప్రభుత్వ బస్సులపై ఆధారపడతారనీ, దీనిని ప్రభుత్వాలు వ్యాపారంగా కాకుండా ఒక బాధ్యతగా నిర్వహించేవని అన్నారు. కానీ నేడు ఈ వై.సి.పి ప్రభుత్వం వచ్చాకా నేడు ఆర్టీసి పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యిందనీ, 90శాతం ఉద్యోగస్తులు అనారోగ్య సమస్యలతో బాధింపబడుతున్నారనీ, శెలవులు ఇవ్వకుండా డ్యూటీలను వేసి పీడిస్తోంది ఈ ప్రభుత్వం అని వాపోతున్నారనీ, వీటికి తోడు గతుకుల రోడ్లు, దొక్కు బస్సులు అనీ కొత్త బస్సులు కొనే ఉద్దేశం హెలీక్రాఫ్టర్లలో తిరిగే ఈ ముఖ్యమంత్రికి లేదనీ, ప్రయాణీకుల మరియు సిబ్బంది జీవితాలతో ఈ ముఖ్యమంత్రి ఆటాడుకుంటున్నారటీ దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఆర్టీసీని కాపాడి తిరిగి గాడిలో పెట్టి సిబ్బంది కష్టాలను జనసేన తెలుగుదేశంల ఉమ్మడి ప్రభుత్వం చేపడుతుందని భరోసా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, జనసేన నాయకులు కంట రవిశంకర్, పచ్చిపాల మధు, షమీర్, కాశ్మీర్ ఖాన్, దారపు సతీష్, ఆకుల శ్రీనివాస్, మనోహర్లాల్ గుప్తా, సతీష్ కుమార్, వాసిరెడ్డి సత్య కుమార్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.