బెంతో ఒరియాలకు జరుగుతున్న అన్యాయానికి అధికారులు, ప్రజా ప్రతినిధిలు స్పందించాలి

  • బెంతో ఒరియా కులస్తుల రిలే నిరాహార దీక్ష 31వ రోజు

ఇచ్చాపురం: పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ నాడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన 90 రోజులకే మీ సమస్య పరిష్కారం చేస్తాను అని మాట ఇచ్చి ఇప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం పట్ల బెంతో ఒరియా కులస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు పునరుద్దరణ కొరకు బెంతో ఒరియా కులస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 31వ రోజుకి చేరుకుంది. దీక్షలో నాథపుట్టుగ గ్రామస్తులు పెద్దలు, యువత పాల్గొని తమ కులానికి స్థానిక నియోజక వర్గం ఇచ్ఛాపురంలో మా బెంతో ఒరియలకు జరుగుతున్న అన్యాయానికి రెవెన్యూ అధికారులు మరియు ప్రజా ప్రతినిధిలు స్పందించాలని 2003 వరకూ యస్టీగా భారత రాజ్యాంగంలో ఉన్న మాకు ప్రస్తుతం నేటివిటీ పాత్రలు కూడా ఇవ్వడం లేదని మండల తల్సిదార్ వైఖరికి, జిల్లా కలెక్టర్ కాలయాపనకి వ్యతిరేకంగా నిరసనను ప్రభుత్వానికి తెలుపుతున్న బెంత్ ఒరియా ప్రజానీకం. వెంటనే న్యాయం చేయాలని కోరారు. లేకుంటే ఉద్యమం ఉద్రిక్తం అయిన బాధ్యులు ప్రభుత్వమే అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖేత్రో దొలై, రుస్య దొలై, పుర్ణో దొలై, కామేష్ దొలై, కిరణ్ దోళాయి, జయసేన్ బిసాయి, కృష్ణ దొలై తదితరులు పాల్గొన్నారు.