కంచిలి మండలంలో బెంతో ఒరియాల భారీ ర్యాలీ

ఇచ్ఛాపురం నియోజకవర్గం: కంచిలి మండలంలో బెంతో ఒరియా కులస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. కంచిలి జే యమ్ జే స్కూల్ నుండి స్థానిక మండల తహల్సీదార్ కార్యాలయం వరకు సుమారు 5వేల మంది జనాభాతో పెద్ద యెత్తున బెంతో ఒరియా ప్రజలు తమ కులనివాస పత్రాలు వెంటనే ప్రభుత్వం పునరుద్దరణ చేయాలని నినాదాలతో హోరెత్తించారు. తహల్సిదార్ కార్యాలయానికి చేరుకుని యస్ హైమవతి గారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం కుల పెద్దలు డాక్టర్ జోగోబొదు దొళాయి, బెదోబోరో బిసాయి మాట్లాడుతూ అధికారులకు యెన్నో సార్లు వినతీ పాత్రలు అందించిన పక్కన పెట్టేస్తున్నారు మాపై తప్పుడు నివేదిక ఇవ్వడం బాధాకరం అని వ్యక్తం చేశారు. నిజమైన బెంతో ఒరియా గిరిజనులు అయిన మాకు బ్రిటిష్ కాలం నుండి 2003 వరకు రాజ్యాంగంలో హక్కులు కలిగివున్నది వాస్తవం కానీ ఇప్పుడు మాత్రం కనీసం నేటివిటి కూడా ఇవ్వడం లేదని తాము ఎక్కడ ఎదిగి పోతమో అని ఏటువంటి ప్రభుత్వ నిబంధనతో జి ఓ పాస్ లేకుడా అకారణంగా మా కుల ధృవీకరణ పత్రాలు, నేటివిటి ఆపివేశారు అని వాపోయారు. రాజకీయ లబ్ది కుట్రలో భాగంగా తమపై బీ సీ ఏ గా చిత్రీకరిస్తూ ఆదివాసులు చేస్తున్న రిరధార ఆరోపణ ర్యలికి రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి సిదిరి అప్పలరాజు వెళ్లి సంఘీభావం తెలిపడం అవివేకం, శోచనీయం అని బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి ఇరు సామాజిక వర్గంల యొక్క పత్రాలు పరిశీలించడం పోయి ఆదివాసులకు మద్దతు పలికి బెంతో ఒరియా ప్రజల న్యాయ పోరాటానికి మనోభావాలకు భంగం వాటిల్లే విధంగా తీరును ప్రతినిధి రజినీ కుమార్ దొలయి, సుమన్ బిసాయి ఖండించారు. ఈ సందర్భంగా బెంతో ఒరియాలు ఆదివాసులకు శాంతియుత బహిరంగ చర్చలకు సిద్దమా అంటు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు మారిన మాకు న్యాయం జరగడం లేదని కేవలం ఓటు కోసమే వాడుకోవడం పట్ల అవేదన చేశారు. ఇప్పటికీ ఐనా ప్రభుత్వం కళ్లు తెరచి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న నిజమైన బెంతో ఒరియలకు గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి న్యాయం చేయాలని భావి తరాల మనుగడ కాపాడాలని తాము ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నమని న్యాయం చేయాలని కోరారు. న్యాయం చేయని యడల ఇంతటితో ఆగదు మరింత ఉద్రిక్తం అవుతాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కులప్రజలు, కుల పెద్దలు, సీనియర్ సిటిజన్ లక్ష్మణ్ బిసాయి, భిమ్మో సాహు, దేవరాజు సాహు, బృందావన్ మజ్జి, గోపి బిసాయి, బృందావన్ సాహు, జయసేన్ బిసాయి, దుదిస్టి మజ్జి, సంతోష్ దొలయి తదితరులు పాల్గొన్నారు.