మధ్యపాన నిషేధం ఎప్పుడు జగన్?

  • మాట తప్పడం మడమ తిప్పడం నీకే చెల్లు జగన్

మదనపల్లె: నక్కలదిన్నెలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీరమహిళలతో కలసి జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్స్ అపుడు అమలు కానీ హామీల గురించి విమర్శించారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చాడు. దాదాపు 5 సంవత్సరాల కాలం పూర్తి అవుతున్న జగన్ ఇంతవరకు మధ్యపానం నిషేధం చేయకపోగా నాసిరకం బ్రాండ్ లను తెచ్చి పేద ప్రజల భవిష్యత్తు, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని విమర్శించారు. పథకాలు పేర్లు చెప్పి 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులేస్తున్న మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అడుగు జాడల్లో మేము కూడా వైసీపీ రహిత పార్లమెంట్, వైసీపీ రహిత మదనపల్లి దిశగా వచ్చే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. మదనపల్లి చైర్మన్ ని సదుంలో డిసైడ్ చేస్తారు. ఎమ్మెల్యే టికెట్ సదుంలో డిసైడ్ చేస్తారు, మదనపల్లిని జిల్లా కేంద్రం చేయాలా వద్ద అని సదుంలో డిసైడ్ చేస్తారని అన్ని అర్హతలు ఉన్న మదనపల్లి ని జిల్లా కేంద్రంగా చేయకుండా మదనపల్లి ప్రజల మనోభావాలు దెబ్బతీసింది కాబట్టి మదనపల్లి, పీలేరు పుంగనూరు, తంబాలపల్లి ప్రజలు అలోచన చేయాలని ఇది మదనపల్లి ఆత్మగౌరవానికి సదుం అహంకారనికి మధ్య జరుగుతున్న పోరాటంలో వైసీపీ ఓడించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డెమ్మ, సరోజ, స్వాతి, పట్టణ సెక్రటరీ నాగవేణి, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర, కుమార్, రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, పట్టణ సెక్రటరీ జనర్దన్, పట్టణ ఉపాధ్యక్షులు ప్రసాద్, లవన్న, రాజారెడ్డి, నరేష్, రూరల్ ప్రధాన కార్యదర్శి పవన్ శంకర, విజయ్ కుమార్, గంగులప్ప, పట్టణ ప్రధాన కార్యదర్శి జవిలి మోహన్ కృష్ణ, కిషోర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.