కాళ్లు పగిలి, రక్తం కారుతున్నా జనసేన మహాపాదయాత్ర ఆపాలి అనిపించడం లేదు: బొర్రా

సత్తెనపల్లి, జనాభిమానం చూస్తుంటే, కాళ్ళకు గాయమైన పాదయాత్ర ఆపాలి అనిపించడం లేదని జనసేన సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. కాళ్లకు కట్టులతోనే నకరికల్లు నుండి పాదయాత్ర ప్రారంభించారు. నేటికి 46 కిలోమీటర్లు చేరుకున్నామన్నారు. నాలుగవ రోజు పాదయాత్ర నకరికల్లు గ్రామంలోని కారంపూడి జంక్షన్ నుండి చల్లగుండ్ల, అడ్డరోడ్డు, విప్పర్ల, రెడ్డిపాలెం మీదుగా కుంకలగుంట గ్రామం ఉంటుందన్నారు. జనసేన-టిడిపి నాయకుల ఆత్మీయ స్వాగతం మర్చిపోలేని ఉన్నారు.వ్జనసేన క్యాడర్ ఉత్సాహం చూస్తుంటే గాయాలు ఉన్న విషయం కూడా అర్థం కావడం లేదన్నారు. కర్షిక కార్మిక చేతివృత్తుల వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి పాదయాత్ర ఉపయోగపడిందన్నారు. ఇదే ఉత్సాహంతో జనసేన క్యాడర్, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చేసే రాజశ్యామల యాగాన్ని కూడా జయప్రదం చేయాలని కోరారు. పాదయాత్రలో జనసైనికులు, వీర మహిళలు జనసేన కార్యకర్తలు అభిమానులు ఆదరణ మరువ లేనిదన్నారు. ఈ పాదయాత్రలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, ఏడో వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, సత్తనపల్లి మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, సత్తెనపల్లి మండలం షేక్ రఫీ, చిలకా పూర్ణ, గంజి నాగరాజు, మాజీ ఎంపీటీసీ శివ, తోట రామాంజినేయులు, షేక్ కన్నా, సురేష్, ఏసుబాబు, రుద్రజడ ఆంజనేయులు, రుద్రజాడ బుల్లి అబ్బాయి, శేషు, పసుపులేటి వేంకటేశ్వర్లు, పోకల శ్రీను, షేక్ రఫీ, పసుపులేటి మురళి, నక్క వెంకటేశ్వర్లు, షేక్ మీరవలి, కొడమల శ్రీను, నామాల పుష్ప, గట్టు శ్రీదేవి, మెద్దెం మహాలక్ష్మి, అంకారావు, నాయకులు, వీరమహిళలు, తెలుగుదేశం పార్టీ, నాయకులు అభిమానులు పాల్గొన్నారు.