పేర్ని నాని, కిట్టుపై కొరియర్ శ్రీను సంచలన వ్యాఖ్యలు

మచిలీపట్టణం, మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన తనయుడు పేర్ని కిట్టుపై జనసేన నేత కొరియర్ శ్రీను ఫైర్ అయ్యారు. కొరియర్ శ్రీను కార్యాలయం వద్ద కట్టిన బ్యానర్లను పేర్ని నాని అనుచరులు దగ్ధం చేయడంపై ఆయన ఇనగుదురు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మీకింకా అధికారం రెండు నెలలే అని, అధికారం పోయిన తర్వాత తండ్రీ కొడుకులిద్దరికీ నా లారీపై డ్రైవర్, క్లీనర్ ఉద్యోగం ఇచ్చి గౌరవంగా చూస్తానన్నారు.