రామకృష్ణారావుపేటలో మేము సిద్దమే కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ్ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో రామకృష్ణారావుపేట ఆనంద్ భారతి సమీపంలో డాక్టర్ బాబు, జాడా రాజు ఆధ్వర్యంలో కాకినాడ సిటిలోనే ఉపాధి అది మా హక్కు అని అంటూ మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ స్థానికంగా ఉపాధి కల్పించడంలోనూ, పేదలకు నీడ కల్పించే విషయంలో వైకాపా పార్టీ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడంలో మాట తప్పి నిలువునా మోసం చేసిన వైకాపా నాయకులు ఇంకా అధికార మదంతో కొట్టుమిట్టాడుతూ పాలన వదిలి ప్రతిపక్షాలను హేళన చేయడం దుర్మార్గం అన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాకినాడ నగరంలో ఎమ్మెల్యే ద్వారంపూడిని రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపేందుకు కాకినాడ నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. రాజ్యాంగపరంగా ఎన్నికలలో పోటీ చేసే అవకాశం అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుందని దానిలో భాగంగానే ఏ రాజకీయ పార్టీపై పోటీ చేయాలో ఆయా పార్టీల అధ్యక్షులు చూసుకుంటారని అవగాహన లేని మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్ళ కాలంగా వైకాపా పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ప్రజలు విసుకెక్కిపోయి ఉన్నారన్నారు. వాస్తవాన్ని గ్రహించలేక అధికారం దూరమవుతుందని బాధను జీర్ణించుకోలేక సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా సమ్యుక్త కార్యదర్శి బదే క్రిష్ణ, జనసేన నాయకులు చోడిశెట్టి శ్రీమన్నారాయణ. మనోహర్ లాల్ గుప్తా, బసవాడి నాగబాబు, సత్తిబాబు, అగ్రహారం సతీష్, కాంటారవిశంకర్, దారపు సతీష్, వాసిరెడ్డి సుబ్బారావు, చీకట్ల శ్రీనివాస్, వీరమహిళలు మిరియాల హైమావతి, బోడ పాటి మరియ, బండి సుజాత, సబ్బే దీప్తి, నగీన, ఖాతూన్, తదితరులు పాల్గొన్నారు.