ఉక్రెయిన్‌ రెజ్లింగ్‌లో స్వర్ణం సాధించిన వినేశ్‌ ఫొగట్‌

కీవ్‌: అవుట్‌స్టాండింగ్‌ ఉక్రెయిన్‌ రెజ్లర్స్‌ అండ్‌ కోచెస్‌ మెమోరియల్‌ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు స్వర్ణం లభించింది. ఆదివారం కీవ్‌లో జరిగిన టోర్నీ ఫైనల్‌ పోరులో యూరోపియన్‌ ఛాంపియన్‌ వనేసాను 10-8 తేడాతో వినేశ్‌ ఓడించింది. ఈ ఏడాదిలో ఫొగట్‌కు ఇదే తొలి గెలుపు. మహిళల 53 కిలోల విభాగంలో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ వనేసాను మట్టికరిపించిన వినేశ్‌ ఫొగట్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఫోగట్ ఇప్పటికే 53 కిలోల విభాగంలో బెర్త్‌ను ఖరారు చేసుకున్నది.