వచ్చే ఏడాది ‘సలార్‌’ సందడి

వచ్చే ఏడాది అంటే 2022 ఏప్రిల్‌ 14న ప్రభాస్‌ నటిస్తున్న సలార్‌ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మేరకు చిత్రబృందం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. కెజిఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ సందడి చేయనున్నారు. రూ.150 కోట్లతో ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇటీవల గోదావరిఖనిలోని బగ్గుగనుల్లో చిత్రీకరించారు.