కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

అందాల భామ కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో మహిళా ప్రాధాన్యత చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి ఆ కోవలోకే వస్తాయి. పెంగ్విన్, మిస్ ఇండియా చిత్రాలు కరోనా సమయంలో ఓటీటీలో విడుదల కాగా, తాజాగా గుడ్ లక్ సఖి చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించారు. జూన్ 3న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళంలో విడుదల కానుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కిన “గుడ్ లక్ సఖి” సినిమాకి శ్రావ్య వర్మ సహా నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పాడిరి గుడ్ లక్ సఖి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మంచి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు కీర్తి సురేష్ నటించిన రంగ్ దే చిత్రం మార్చి 26న విడుదల కానుండగా, సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది.