గాజు గ్లాసుతో చాయ్- చాయ్ తో చర్చ కార్యక్రమం

నందిగామ నియోజకవర్గం: కంచికచర్ల మండలం కంచికచర్ల పట్టణం చెవిటికల్లు సెంటర్ అంబేద్కర్ విగ్రహం నందు నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పిలుపు మేరకు కంచికచర్ల మండల అధ్యక్షులు నాయని సతీష్ ఆధ్వర్యంలో గాజు గ్లాసుతో చాయ్ చాయ్ తో చర్చ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా వివిధ కార్మిక వర్గాల ప్రజలతో రమాదేవి మమేకమై వారి సమస్య లు తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇల్లు కట్టిస్తానని చెప్పి మోసం చేసిందని మహిళా కార్మికులు రమాదేవి కి చెప్పుకున్నారు. అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేసారు. మద్యపానం నిషేధం అని చెప్పిన జగన్ తమ భర్తలకి ఆరోగ్యం పాడుచేసే మద్యాన్ని జగన్ తీసుకొచ్చి తమ జీవితాలని నాశనం చేస్తున్నాడని తెలియజేసారు. ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎదుర్కుంటున్న లెక్కలేనన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. కంచికచర్ల రైతుబజార్ మార్కెట్ ని సందర్శించానని, శ్రమిస్తున్న రైతులకు జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్ ని ప్రజల్లోకి వెళ్ళేవిధంగా గాజు గ్లాసులో చాయ్ అందించారన్నారు. పట్టణంలో ముఖ్యంగా రైతులు ఇళ్ల పట్టాలు, డ్రైనేజి, గిట్టుబాటు ధర, త్రాగునీరు పలు సమస్యలు రమాదేవి గారికి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కంబంపాటి రమాదేవి, పుప్పాల వేణుగోపాల్, కోటారు దేవేంద్ర, పెద్దినిడి హరిబాబు, జెర్రిపోతుల చంటి బాబు, నరసింహ, కూసునూరి నరసింహ, వనపర్తి పద్మారావు, మండల అధ్యక్షులు కుడుపుగంటి రాము, సురా సత్యన్నారాయణ, పురంశెట్టి నాగేంద్ర మరియు కంచికచర్ల జనసైనికులు, జనసేన నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం అనాసాగరం క్రీయాశీలక సభ్యుడు పులిబండ్ల అంకమ్మరావు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. జనసేన సభ్యత్వం ఉండటం వలన వారి కుటుంబాన్ని మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో స్వయంగా తమ కారులో తీసుకోని వెళ్ళీ వారి కుటుంబ సభ్యులకు 5లక్షల ప్రమాదబీమా చెక్కును అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారితో రమాదేవి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.