రంగబాబుని పరామర్శించిన బోడపాటి శివదత్

పాయకరావుపేట నియోజకవర్గం: కోటవురట్ల మండలంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ కోడవురట్ల గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు విలేకర్ రంగబాబు అబ్బాయికి ఆరోగ్యం బాగోలేదని తెలిసుకొని రంగబాబుని పరామర్శించారు. అనంతరం కోటవురట్ల మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు వివిధ గ్రామాల నుండి విచ్చేశారు. మండల కమిటీ వేసే విధానం సరికాదని తెలియజేశాం. కోటవురట్ల మండలంలో ఉన్న నాయకులకు జనసైనికులు గాని అటువంటి సమాచారం ఇవ్వకుండా మండల అధ్యక్షుడు నియమించడం, అలాగే మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఏటువంటి సమాచారం ఇవ్వకుండా మండల కమిటీలో తనకు నచ్చిన వ్యక్తులను నియమించడం జరిగింది. ఇదే వైఖరి కంటిన్యూ అవుతే రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలహీన పడుతుందని ఉద్దేశంతో జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచవలసిందిగా విన్నవించుకున్నాం. ఈ కార్యక్రమంలో బాలేపల్లి ఏసుబాబు, జవ్వాది బద్రి, బత్తుల బాబురావు, శానాపతి శివజగదీష్, రంగాబాబు, కనకరాజు, రాజా రమణ, సురేష్, హరిబాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.