జయహో బీసీ కార్యక్రమంలో పాల్గోన్న చిన్నా రాయల్

  • పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డి అధ్యక్షతన జయహో బీసీ కార్యక్రమం
  • జయహో బీసీ కార్యక్రమంలో పాల్గోన్న జనసేన పార్టీ ఇంఛార్జ్ చిన్నా రాయల్

పుంగనూరు నియోజకవర్గం, బోడేవారి పల్లి పంచాయతీ ఈడీగపల్లి గ్రామం వద్ద ఉన్న భీమినేని రెస్టారెంట్ నందు.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు.. పెద్ద ఎత్తున జయహో బీసీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. బీసీలకు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు వివరిస్తూ.. బీసీ కులాలకు అనేక రకాలుగా జగన్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది అని.. బీసీ కులాలకు ఒక్క గౌరవ ప్రదమైన పదవి కూడా ఇవ్వలేదని, కేవలం కార్పొరేషన్లు మాత్రమే మిగిలాయి అని.. ఒక్క బీసీ కార్పొరేషన్ కి కూడా ఒక్క పైసా డబ్బు విడుదల చేసింది లేదనీ.. పైగా ఉన్న డబ్బులను వేరే పథకాలకు మల్లించారానీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించారు.. 75 మందికి పైగా బీసీలు హత్య చేయబడ్డారు.. 2500 మంది పైన దాడులు చేశారు..
నిరుద్యోగులకు 70వేల కు పైగా బీసీ బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయలేదు. బీసీలకు చెందిన 14 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములను కబ్జా చేశారు.. బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు.. బీసీ స్కాలర్షిప్, ఆదరణ పథకం, బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం, ఏపీ స్టడీ సర్కిల్స్ లాంటి ఎన్నో పథకాలను తీసివేశారు. తెలుగుదేశం జనసేనా ప్రభుత్వం వచ్చిన వెంటనేమళ్ళీ బీసీలకు పూర్వ వైభవం తెస్తామని తెలియజేశారు.