కొమ్ము పుట్టుగలో గుంతల రోడ్డుని పరిశీలించిన దాసరి రాజు

ఇచ్చాపురం, కవిటి మండలం నెలవంక పంచాయతీ కొమ్ముపోటు గ్రామంలో కొన్నేళ్లుగా గుంతలుగా ఏర్పడిన రోడ్డును బాగు చేయాలని గ్రామస్తులు విరాళాలు సేకరిస్తున్న విషయాన్ని సోషల్ మీడియా మరియు స్థానిక జనసైనికుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఇచ్చాపురం జనసేన ఇన్చార్జి దాసరి రాజు శనివారం ఆ గ్రామంలో పర్యటించి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, ముసలివారు, యువత అందరూ వచ్చి దాసరి రాజు ముందు తమ బాధని చెప్పుకుంటూ, ఆ రోడ్డు నుంచి వాటర్ ప్లాంట్ వెళ్లి నీరు తీసుకొచ్చే సమయంలో మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కొన్నిసార్లు మార్గమధ్యంలో ముసలి వాళ్ళ సైతం పడిపోయారని, చిన్నపిల్లలు బడికి వెళ్లాలన్న ఆ మార్గంలోనే వెళ్లాలని గుంతల రోడ్డు వల్ల అందరికీ సమస్య అని చెప్తూ, వాపోయారు. వారి మాటలు విన్న దాసరి రాజు మాట్లాడుతూ ఒక గ్రామానికి కిలోమీటర్ దాటి ఉన్న రోడ్డుని కూడా వేయలేనటువంటి పాలకులు ఉన్నందుకు సిగ్గుపడాలని, ఈ మార్గంలో ప్రయాణిస్తూ నిండు గర్భిణీ పడిపోయిన విషయం గ్రామస్తుల ద్వారా తెలిసి చాలా బాధ కలిగిందని అన్నారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఏదైతే రోడ్డును గ్రామస్తులు వేసుకోవడానికి ముందుకు వచ్చారో వారికి సహాయంగా జనసేన పార్టీ తరఫున కొన్ని కంకర లోడులని పంపిస్తానని గ్రామస్తులకు మాటిచ్చారు. రాబోయే టిడిపి జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో మంచి రోడ్డును వేసుకుందామని అన్నారు. ఈ మేరకు కొమ్ముపుట్టుగ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు దుగాన దివాకర్, హేమా చలపతి, మధు,శేఖర్, జ్ఞానేశ్వర్, ధనుంజయం, జోగా రావు, సతీష్, హేమంత్, శివ, వైకుంఠ రావు, కంచిలి మండల అధ్యక్షులు శ్రీ డొక్కరి ఈశ్వరరావు, మున్సిపాలిటీ వార్డు ఇంచార్జ్ రోకళ్ళ భాస్కర్, నాగరాజు, సతీష్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.