జగన్ రెడ్డి అర్జునుడు కాదు – పరిపాలన చేతకాని అధముడు

  • వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  • ఎన్ని యాత్రలు తీసినా.. తీర్థయాత్రలు చేసినా వైసీపీకి అంతిమయాత్ర తప్పదు
  • గుంటూరు నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే పదే తనను తాను అర్జునుడిగా చెప్పుకుంటున్నాడని, జగన్ రెడ్డి అర్జునుడు కాదని పరిపాలన చేతకాని అధముడని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ విమర్శించారు. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 56వ డివిజన్ అధ్యక్షుడు పులిగడ్డ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నెహ్రు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున మహిళలు జనసేన పార్టీ శ్రేణులకు అపూర్వ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ ఎప్పుడైతే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఆ క్షణం నుంచి రాష్ట్రానికి శని పట్టిందన్నారు. ఎవరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లు తప్పా ప్రజల మొహంలో ఎక్కడా సంతోషం కనపడటం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల జీవితాలు చిన్నాభిన్నామయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాల నుంచి, దాష్టీకాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ప్రజల్లో నెలకొన్న ఆగ్రహానికి వైసీపీ భూస్థాపితం అవ్వటం ఖాయమని నేరేళ్ళ సురేష్ అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వద్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ యాత్రల పేరుతో ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా వైసీపీకి అంతిమయాత్ర తప్పదని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీని ఏ శక్తీ కాపాడలేదని పేర్కొన్నారు. జనసేన టీడీపీ నేతృత్వంలో ఏర్పడే ఉమ్మడి ప్రభుత్వంలోనే రాష్ట్రానికి మంచిరోజులు రానున్నాయన్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు నెరేళ్ల సురేష్ ను ఆశీర్వదించి ఒక అవకాశం ఇస్తే సుపరిపాలన అందిస్తాడని, ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడని వద్రాణం మార్కండేయ బాబు అన్నారు. నెహ్రు నగర్ నుంచి మొదలైన జనసేన యాత్ర వీవర్స్ కాలనీ వరకు జరిగింది. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్, రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, జిల్లా ఆధికార ప్రతినిధి ఆళ్ళ హరి పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, కార్పొరేటర్లు దాసరి లక్ష్మి దుర్గ, యర్రంశెట్టి పద్మావతి, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లికా, తెలుగుదేశం నాయకులు యర్రగోపు నాగేశ్వరరావు, బత్తెన శంకర్, ఆనందపు వెంకటేశ్వరరావు, కొంగర క్రిష్ట, హుస్సేన్, పులిగడ్డ గోపి, స్థానిక డివిజన్ అధ్యక్షులు పులిగడ్డ నాగేశ్వరరావు, కార్మిక నాయకుడు సోమి ఉదయ్, నగర ప్రధాన కార్యదర్శులు సూరిశెట్టి ఉదయ్, యడ్ల నాగమల్లేశ్వరరావు, 48 డివిజన్ అధ్యక్షులు అంబటి కుమార్, నగర కార్యదర్శులు బండారు రవీంద్ర, పావులూరి కోటేశ్వరరావు, తిరుమలశెట్టి కిట్టు, బిట్రగుంట శ్రీనివాసరావు, నగర కార్యదర్శి కలగంటి త్రిపురా కుమార్, శనక్కాయల హైమావతి, జలగం మల్లేశ్వరి, 3వ డివిజన్ అధ్యక్షులు మాదాసు శేఖర్, 8వ డివిజన్ అధ్యక్షులు జడ సురేష్, గడసాని అరుణ పాకనాటి రమాదేవి, శ్రీపతి భూషయ్య, నాదెండ్ల రాము, సూదా నాగరాజు, గుర్రాల ఉమా, మెహబూబ్ బాషా, 51వ డివిజన్ అధ్యక్షులు గాజుల రమేష్, 9వ డివిజన్ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్, 14వ డివిజన్ అధ్యక్షులు పవన్ నాయక్, 44వ డివిజన్ అధ్యక్షులు పవన్ వెంకి, జనసైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.