రేషన్ బియ్యాన్ని బుక్కేస్తున్న 6వ డివిజన్ వైకాపా నాయకులు: పెండ్యాల శ్రీలత

అనంతపురం, జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా సోమవారం 29వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 6వ డివిజన్ నీరుగంటి వీధిలో పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలపై ఆమె మాట్లాడుతూ ఈ డివిజన్ లో పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని గడిచిన మూడు మాసాల నుంచి అందించ కుండా వారితో వేలిముద్రలు తీసుకోని రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తామని రేషన్ డీలర్లు కాలయాపన చేస్తున్నారని ఇదేమిటని స్థానిక ప్రజలు వలెంట్రిలను అడిగితే వారు కార్పొరేటర్ మీద డీలర్ల మీద పొంతనలేని సమాధానాలు చెపుతున్నారని మొత్తంగా చుసుకున్నట్లయితే ఈ వ్యవహారంలో ఆరవ డివిజన్ వైకాపా నాయకుల ప్రతి ఒక్కరి హస్తం ఉందని ఈ విశయాలన్ని సివిల్ సప్లయర్స్ అధికారులకు తెలిసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అందరూ పేదలకు ఇవ్వ వలసిన బియ్యాన్ని అక్రమంగా అమ్ముకొని బాగలు వేసుకొని లెక్కలు పంచుకుంటున్నారని వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే అని అందరి లెక్కలు,అవినీతిని తెలుస్తామని ఈ బియ్యం అవినీతిలో ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డికి కూడా వాటా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసేననాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.