పెడన సీటు జనసేనదే

పెడన నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. నియోజవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జనసేన పార్టీ నాయకులు ఈ పత్రిక సమావేశంలో చర్చించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెడన నియోజవర్గం సీటును జనసేన పార్టీకి వస్తుందని జనసేన నాయకులు తెలియజేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీ అనేక పోరాటాలు చేశామని తెలియజేశారు. మడ అడవులు కావచ్చు, మట్టి అక్రమ రవాణా కావచ్చు సమర్థవంతంగా ఎదుర్కొన్నది మేమేనని తెలియజేశారు. నియోజకవర్గ సమస్యలపై అనేక పోరాటాలు చేసామని, దానికి అనుగుణంగా అధికార పార్టీ అనేక అక్రమ కేసులు జనసేన పార్టీ నాయకులు పై పెట్టిందని ఈ సందర్భంగా తెలియజేశారు. పెడన నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, సాగునీరు సరిగా లేకపోవడం వలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జనసేనని కోరుకుంటున్నారని, ప్రజా సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్న జనసేనకే పట్టం కట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అనేక పత్రికల్లో ఇప్పటికే పెడన సీటును జనసేన కేటాయిస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. పెడన నియోజకవర్గం పవన్ కళ్యాణ్ దృష్టిలో ఉందని అందుకునే వారాహి యాత్ర కూడా పెడనలో నిర్వహించి బహిరంగ సభ పెట్టారని తెలియజేశారు. ఈ పత్రిక సమావేశంలో పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్.వి.బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరి రామ్, పండమనేని శ్రీనివాస్, కార్యదర్శి కూనసాని నాగబాబు, కనపర్తి వెంకన్న, మట్ట నాగరాజు, గల్లా హరీష్, శీరం సంతోష్, చీర్ల నవీన్ కృష్ణ, ముద్దినేని రామకృష్ణ, సమ్మెట చిన్ని, బొమ్మిరెడ్డి భగవాన్, సమ్మెట గణపతి, అబ్దుల్ నజీర్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.