పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని ప్రజా ప్రభుత్వంలో పూర్తి చేస్తాం

సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, రాజోలు గ్రామపంచాయతీ పరిధిలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలను శనివారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాజోలు గ్రామపంచాయతీ పరిధిలో మండల ప్రజా పరిషత్ పాఠశాల భవనం పెచ్చులూడి శిథిలావస్థలో ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పక్కనే నూతన భవనం కొంతవరకు నిర్మాణం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల 9 నెలలు అవుతుంటే నిర్మాణంలో ఉన్న భవనాన్ని పూర్తి చేయలేకపోయింది. రెండవది ఈ స్కూల్ నందు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు 14 మంది, అంగన్వాడి పిల్లలు 16 మంది ఉన్నారు. ఈ భవనం పెచ్చులూడి పిల్లల తల మీద పడితే వాళ్లకి ఏదైనా ప్రమాదవశాత్తు జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర మంత్రి, స్కూల్ టీచర్లు ఎవరు బాధ్యత వహిస్తారు. ఎందుకని గత ప్రభుత్వం నిర్మాణం చేసిన భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మించి ఇవ్వలేకుండా పెండింగ్లో పెట్టారు. అది ప్రజల సొమ్ము కాదా మీకు బాధ్యత లేదా ఇక రెండో నెలకి ప్రభుత్వం రారబోతుంది. జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాయి. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా ప్రజా ప్రభుత్వంలో పూర్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని, మండల ప్రసాద్ నాయకులు జాకీర్, కోటిరెడ్డి, సుధాకర్, శ్రీను, నరసింహులు, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.