జనసేన విజయ యాత్ర – ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్ 60వ రోజు

శ్రీకాళహస్తి, 60 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారంలో భాగంగా శనివారం శ్రీకాళహస్తి పట్టణం, బహదూర్ పేటలో నాయకులు నక్కా ప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. పెద్ద ఎత్తున వినుతకి జనసైనికులు పూలవర్షంతో స్వాగతం పలికారు. పట్టణంలో ప్రచారం నిర్వహించి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ ని ఆదరించాలని, నియోజకవర్గంలో శ్రీమతి వినుత కోటాని ఆశీర్వదించి, గాజు గ్లాసు గుర్తుకి ఓటు వెయ్యాలని ప్రజలను కోరడం జరిగింది. మార్పు కోసం జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. పలు సమస్యలు వినుత దృష్టికి ప్రజలు తెలిపారు, ముఖ్యంగా రాత్రి వేళల్లో మద్యం బాబులు, గంజాయి మత్తులో మహిళలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నట్టు తెలిపారు. డ్రైనేజ్ కాలువల సమస్య, స్ట్రీట్ లైట్లు సమస్యలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఇంఛార్జి తోట గణేష్, నాయకులు నక్కా ప్రసాద్, అఖిల్ సాయి, సుబ్బు, మునీంద్రా, ఉపాధ్యక్షులు రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, ప్రధాన కార్యదర్శులు పేట చిరంజీవి, కావలి శివకుమార్, కవిత, లక్ష్మి, రాజ్య లక్ష్మి, దండి రాఘవయ్య, పేట చంద్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.