పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్న గాజువాక

గాజువాకలో జనసేన పిఎసి సభ్యులు కోన తాతారావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. గెలుపే లక్ష్యంగా రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, ఇప్పటికే నిర్మాణమైన కార్యవర్గం బూతుస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు స్వేచ్చగా ఎన్నికల ప్రక్రియ జరిగే విధంగా ఓటరు లిస్టులను పరిశీలన చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి శాసనసభకు పోటీ చేయాలని కోన తాతారావు సర్వ సభ్య సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టగా, కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి పార్టీ అధిష్టానానికి పంపించడం జరిగింది. గాజువాకలో ఉన్న దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలతో ప్రజలు సతమతమౌతున్నారు. ఉక్కు నిర్వాసితులు, గంగవరం పోర్టు నిర్వాసితులు, ఫార్మా నిర్వాసితులు, ఏ.పి.ఐ.ఐ.సి నిర్వాసితులు, గాజువాక హౌస్ కమిటి వంటి అనేక సమస్యలు నియోజకవర్గంలో ఉన్నందున, గాజువాకలో జనసేన పోటీ చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టి నాయుకులు గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, దల్లి గోవింద్ రెడ్డి, గంధం వెంకటరావు, పోల రౌతు వెంకట రమణ, గవర సోమశేఖర్, మాక షాలిని, కరణం కనకారావు, దాసరి జ్యోతి, రెడ్డి, కోన చిన అప్పారావు, రౌతు గోవింద్, అరవింద్, త్రినాథ్, చైతన్య, కనకరాజు పాల్గొన్నారు.