పారిశుద్య కార్మికులతో టీ విత్ డాక్టర్ బాబు

రాజోలు, జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గ పారిశుద్య కార్మికులతో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు కలసి వారు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను తెలుసుకున్నారు. గాజు గ్లాస్ తో టీ అందరికి ఇచ్చి వారితో పాటు సుదీర్ఘంగా మాట్లాడి వారి ప్రధాన సమస్యలు అయిన

  • పంచాయతీలకు సంబంధం లేకుండా పారిశుద్ధ కార్మికులకు సమాన వేతనం ఇవ్వాలి
  • టిఏ/డిఏ లు కూడా సమానంగా ఇవ్వాలి
  • పిపిఈ పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్మెంట్ కల్పించాలి.
  • ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలను కల్పించాలి
  • కార్మికుల ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
  • నెల నెలా జీతాలను సమయానికి ఇవ్వాలి మొదలయిన సమస్యలను అడిగి తెలుసుకుని జనసేన పార్టీ అధ్యక్షులు దృష్టికి తీసుకివెళ్లి, రాబోయే జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వంలో వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తామని డాక్టర్ రమేష్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర వికాస విభాగ సెక్రటరీ పొన్నాల ప్రభ, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, అంతర్వేది దేవస్థానం ఎంపిటిసి బైరా నాగరాజు, అంతర్వేదిక ఎంపీటీసీ చొప్పల బాబురావు, కేశవదాసు పాలెం ఎంపీటీసీ ఉండపల్లి అంజి, జనసేన నాయకులు అల్లూరి రంగరాజు, రావూరి నాగు, కొనతం నరసింహారావు, మల్కిపురం మండల ప్రధాన కార్యదర్శి నల్లి పవన్ ప్రసాద్, సఖినేటిపల్లి మండల కార్యదర్శి బొమ్మిడి ఏడుకొండలు, బుద్ధి గ్రామ శాఖ అధ్యక్షులు కొల్లు వెంకటరాజు, జనసేన నాయకులు పోతు కృష్ణ, టిడిపి గ్రామ శాఖ అధ్యక్షులు మండపాటి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు భాస్కర్ల సత్తిబాబు, గుండుబోగుల సాయి, మారేళ్ల నాని, సందాని, కట్టా రమేష్, కట్టా వరప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది.