పోలవరంని కేంద్రంగా, జిల్లాగా ఏర్పాటు చెయ్యాలి

పోలవరం నియోజకవర్గం: పోలవరం గ్రామంలో జరిగిన జెఏసీ అఖిలపక్షంగా ఏర్పాటు చేసిన పోలవరంను జిల్లాగా ఏర్పాటు చెయ్యాలి అనే కార్యక్రమానికి చిర్రి బాలరాజు విచ్చేసారు. ఈ సందర్భంగా అయన ప్రసంగిస్తూ పోలవరంని కేంద్రంగా, జిల్లాగా ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసారు. ఇటు రంపచోడవరంకి 65 కిలోమీటర్లు అటు జీలుగుమిల్లికి 70 కిలోమీటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. రంపచోడవరంలో 11 మండలాలు పోలవరంలో 7 మండలాలు ఇది మొత్తం 18 మండలాల ఆకాంక్ష అని అయన తెలిపారు. ఏలూరు తర్వాత అత్యున్నత కేంద్రంగా పోలవరం ఉందని చెప్పారు. జిల్లాల వికేంద్రీకరణ వల్ల వచ్చే నష్టాలకంటే లాభాలే ఎక్కువ. మొదటగా మనం ఈ విషయాన్ని రాజకీయ కోణంగా కాకుండా పూర్తి శాస్త్రీయ కోణంతో చూడాలని ఆకాంక్షించారు. పాలన పరంగా అధికారులకు వెసులుబాటు. జిల్లా ప్రజలకు వారి సమస్యలు చెప్పుకునేందుకు వారి జిల్లా కేంద్ర కార్యాలయం దగ్గరలో ఉంటుంది. చిన్న జిల్లాల వలన అధికారులు వేరు వేరు గ్రామాలు, పట్టణాలపై శ్రద్ధ పెట్టచ్చు. మరియు వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని పరీక్షించవచ్చు. జిల్లా కేంద్రాల అభివృద్ధి. దీనికి జనసేన పూర్తిగా మద్దతిస్తుందని అయన తెలిపారు.