అభిమానుల ఆశీస్సులే మెగాఫ్యామిలీకి శ్రీరామరక్ష

  • సినీ నటులు వరుణ్ తేజ్

అభిమానుల ఆశీస్సులే మెగాఫ్యామిలీకి శ్రీరామరక్ష అని మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ అన్నారు. బుధవారం నంబూరులోని ప్రైవేట్ కాలేజీకి విచ్చేసిన వరుణ్ తేజ్ ను జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ చిరంజీవి, వరుణ్ తేజ్ ల పుట్టినరోజు సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాల గురించి వరుణ్ తేజ్ కు ఆళ్ళ హరి వివరించారు. మెగాఫ్యామిలీ అభిమానులు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని, ఇలాంటి అభిమానులు మాకు దొరకటం మా అదృష్టం అని వరుణ్ తేజ్ అన్నారు. వరుణ్ తేజ్ ను కలిసిన వారిలో సయ్యద్ షర్ఫుద్దీన్, సోమి ఉదయ్, గడ్డం రోశయ్య, నండూరి స్వామి, సాయి, శ్రీనివాస్ తదితరులున్నారు.